రేవంత్ ఇదిగో నా రాజీనామా
సీఎం నీ రాజీనామా ఏమైంది..?
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ముందుగానే తాను చెప్పినట్టుగానే అమర వీరుల స్థూపం వద్దకు వచ్చానని, రాజీనామా లేఖను సమర్పించడం జరిగిందన్నారు. ఇక మిగిలింది రేవంత్ రెడ్డి రాజీనామా చేయడమేనని పేర్కొన్నారు.
శుక్రవారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు మాజీ మంత్రి . సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాలను స్వీకరించాలని డిమాండ్ చేశారు. తను రావడానికి మొహమాటంగా ఉంటే తన పిఏతో అయినా స్టాఫ్ తో అయినా రాజీనామా లేఖను పంపించాలన్నారు.
జర్నలిస్టుల సాక్షిగా లేదా మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నానని చెప్పారు. ఆగస్టు 15th లోగా ఏక కాలంలో రుణ మాఫీతో పాటు ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసిందన్నారు హరీశ్ రావు.
డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. సోనియమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.