రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
మైకులు ఇవ్వకుండా గొంతు నొక్కారు
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి రాచరిక పాలన సాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు. గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఆందోళన చేపట్టారు.
రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ పోయిందని మండిపడ్డారు. శాసన సభలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మైక్ ఇవ్వకుండా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు తన్నీరు హరీశ్ రావు.
తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవన్నారు. రాష్ట్రం మొత్తం పోలీస్ రాజ్యంగా మారి పోయిందని ఆరోపించారు మాజీ మంత్రి. ఇది పూర్తిగా మంచి పద్దతి కాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చూస్తున్నారని, వారికి సరైన రీతిలో సమాధానం చెప్పడం ఖాయమన్నారు.
మహిళల పట్ల గౌరవం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడటం దారుణమన్నారు. ఇలాంటి వ్యక్తి సీఎం పదవికి అనర్హుడని పేర్కొన్నారు తన్నీరు హరీశ్ రావు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు, దిష్టి బొమ్మలను తగల బెట్టడం జరిగిందన్నారు తన్నీరు హరీశ్ రావు.