నిరూపిస్తే రాజీనామా చేస్తా
మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
మంత్రి హరీశ్ రావుకు సీఎంకు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ప్రస్తుతం విడుదల చేసిన శ్వేత పత్రం పూర్తిగా తప్పుల తడకగా అభివర్ణించారు హరీశ్ రావు. కావాలని తమను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు.
ప్రధానంగా ఉత్తమ్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి. రోడ్ మ్యాప్ ఇవ్వకుండా అభాండాలు మాత్రమే ఉన్నాయని ఆరోపించారు. మేం ఎలాంటి తప్పిదాలు చేయలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల గురించి చెబితే బావుండేదన్నారు హరీశ్ రావు.
ఒక వేళ మిడ్ మానేరు ఉమ్మడి రాష్ట్రంంలో కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.