రేవంత్ రాజీనామాకు సిద్దమా..?
సవాల్ విసిరిన తన్నీరు హరీశ్ రావు
మెదక్ జిల్లా – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే జనం ఊరుకోరన్నారు. మాయ మాటలు చెప్పి పవర్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డి మాటలు మార్చుతూ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆరోపించారు హరీశ్ రావు.
తను రాజీనామా లేఖతో సిద్దంగా ఉండాలని సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి. తాను శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందున్న అమర వీరుల స్థూపం వద్దకు తన రాజీనామా లేఖతో వస్తానని ప్రకటించారు.
మరి నువ్వు కూడా వస్తావా అని సవాల్ విసిరారు సీఎంకు. మన ఇద్దరికి సంబంధించిన రాజీనామా లేఖలను మేధావులకు ఇద్దామన్నారను. వారు నా రాజీనామా లేఖను స్పీకర్ కు అందజేస్తారని, చేయలేక పోతే రేవంత్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు ఇవ్వాలని స్పష్టం చేశారు హరీశ్ రావు.