NEWSTELANGANA

అల్లు అర్జున్ అరెస్ట్ అప్ర‌జాస్వామికం

Share it with your family & friends

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయ‌డం అప్రజాస్వామిక‌మ‌ని అన్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. అస‌లు బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇచ్చింది ఎవ‌రు, ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా సినిమాను ఎందుకు ప్ర‌ద‌ర్శించారంటూ ప్ర‌శ్నించారు. అయితే తొక్కిస‌లాట‌లో రేవంత్ మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌ని అన్నారు. క‌క్ష సాధింపుతోనే బ‌న్నీని అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు.

శుక్ర‌వారం హ‌రీశ్ రావు ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారానికి పూర్తి బాధ్య‌త వ‌హించాల్సింది కాంగ్రెస్ ప్ర‌భుత్వానిదేన‌ని స్ప‌ష్టం చేశారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే తాను చ‌ని పోతున్నానంటూ కొండారెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ సాయి రెడ్డి సూసైడ్ లేఖ రాసినా ఎందుకు అరెస్ట్ చేయ‌లేదంటూ ప్ర‌శ్నించారు.

రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయ‌డం లేదంటూ మండిప‌డ్డారు హ‌రీశ్ రావు.

అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలని అన్నారు. ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చని పోయారని దీనికి సంబంధించి ఎవ‌రిని అరెస్ట్ చేయాల‌ని ప్ర‌శ్నించారు. చ‌ట్టం అల్లు అర్జున్ విష‌యంలోనే కాదు సీఎం రేవంత్ రెడ్డి బ్ర‌ద‌ర్స్ విష‌యంలో నూ స్పందించాల‌ని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *