సీఎం కామెంట్స్ హరీశ్ సీరియస్
కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు తగదు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. రాజకీయ పరంగా ఏమైనా తప్పులు ఉంటే ఎత్తి చూపాలి తప్పా పనిగట్టుకుని వ్యక్తిగత హననం చేయడం తగదని పేర్కొన్నారు.
ప్రభుత్వ పరంగా చోటు చేసుకున్న వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు తమ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం భావ్యం కాదన్నారు తన్నీరు హరీశ్ రావు. సభ్య సమాజం హర్షించదన్నారు. రాజకీయ పరంగా ఎంతో భవిష్యత్తు కలిగిన రేవంత్ రెడ్డి తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడక పోవడం దారుణమన్నారు. ప్రజలు దీనిని ఒప్పు కోరని పేర్కొన్నారు.
పదకొండు నెలల పాలనలో ఆయన నోటి వెంట పదే పదే బూతులు తప్పా ఏనాడూ మంచి వ్యాఖ్యాలు, పదాలు రాలేదన్నారు. ఏం సాధించారని కాంగ్రెస్ విజయోత్సవ సభ చేపట్టారో వారికే తెలియాలని అన్నారు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవని, తెలంగాణ సమాజం మరిచి పోదన్నారు.