NEWSTELANGANA

ప్ర‌భుత్వ తీరు అమానుషం..దారుణం

Share it with your family & friends

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – వికారాబాద్ జిల్లా దుద్వాల మండ‌లం ల‌గ‌చ‌ర్ల గ్రామానికి చెందిన గ్రామ‌స్థులను అదుపులోకి తీసుకోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి తన్నీరు హ‌రీశ్ రావు. త‌ర త‌రాల నుంచి భూముల‌ను క‌లిగి ఉన్న వారి ప‌ట్ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు దారుణ‌మ‌న్నారు. ప్ర‌భుత్వ తీరు అమానుష‌మ‌ని పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన ల‌గ‌చ‌ర్ల వాసుల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు.

లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామిక‌మ‌ని ఆరోపించారు. ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరి కాద‌ని పేర్కొన్నారు హ‌రీశ్ రావు. ప్రభుత్వం తీరును ఖండిస్తున్నాం. ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశ్యం తెలియాలని డిమాండ్ చేశారు.

సీఎం వ్యక్తిగత ప్రయోజనాలకోసం చేపడుతున్న భూ సేకరణను తక్షణం నిలిపి వేయాలని అన్నారు. పోలిసుల అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.