NEWSTELANGANA

రైతులంద‌రికీ రుణ మాఫీ చేయాలి

Share it with your family & friends

మాజీ మంత్రి హ‌రీశ్ రావు డిమాండ్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రైతులు తీసుకున్న రుణాల‌కు సంబంధించి మాఫీ చేయ‌డంలో ప‌లు నిబంధ‌న‌లు పెట్ట‌డాన్ని తీవ్రంగా త‌ప్పు పట్టారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఎలాంటి రూల్స్ విధించ లేద‌ని, ఎన్ని ఎక‌రాలు ఉన్నా ప్ర‌తి ఒక్క రైతుకు ల‌బ్ది చేకూర్చేలా రుణాల‌ను మాఫీ చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. అంతే కాదు దేశంలో ఎక్క‌డా లేని రీతిలో రైతు బంధును విజ‌య‌వంతంగా అమ‌లు చేశామ‌న్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

ఇదిలా ఉండ‌గా రైతులందరికీ రుణ మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ స‌ర్కార్ ఇప్పుడు మాట మార్చి పీఎం కిసాన్ డేటా ఆధారంగా, రేషన్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేస్తామ‌ని చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. ఒక ర‌కంగా అన్న‌దాత‌ల‌ను మోసం చేయ‌డ‌మేన‌ని పేర్కొన్నారు.

అది కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడం శోచనీయమ‌న్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు.