NEWSTELANGANA

ఎమ్మెల్యే వేధింపుల ప‌ర్వం హ‌రీశ్ ఆగ్ర‌హం

Share it with your family & friends

గొంతు కోసుకున్న కౌన్సిల‌ర్ బేరి స‌త్య‌నారాయ‌ణ

హైద‌రాబాద్ – రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగ‌ర్ రావు ఆగ‌డాలు, వేధింపులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయ‌ని ఆరోపించారు. తాజాగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వేధింపులు భరించలేక నస్పూర్ మున్సిపల్ 21 వ కౌన్సిలర్ బేర సత్యనారాయణ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం దారుణమ‌ని పేర్కొన్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా, పోలీసులతో అక్రమ కేసులు పెట్టించి అరెస్టులు చేయించాలని చూడటం హేయమైన చర్యగా ఆయ‌న పేర్కొన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో ప్రతీకార చర్యల సంస్కృతికి స్థానం లేదన్నారు హ‌రీశ్ రావు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిత్యకృత్యం అవుతున్నాయ‌ని వాపోయారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి.