రేవంత్ రెడ్డి ఉద్యమకారుడు కాలేడు
నిప్పులు చెరిగిన తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు.
ఆయన ఏనాడూ జై తెలంగాణ అన్న పాపాన పోలేదన్నారు హరీశ్ రావు. ఆయనకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, నాగరికత తెలియదన్నారు. తెలిసి ఉంటే, ఉద్యమంలో పాల్గొని ఉంటే ఇవాళ తాము తీసుకు వచ్చిన రాజ ముద్రలో మార్పులు చేయాలని అనుకోడని అన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే పాలనా పరంగా ఫెయిల్ అయ్యాడంటూ సంచలన ఆరోపణలు చేశారు హరీశ్ రావు.
. ఆయన పేరు రేవంత్ రెడ్డి కావొచ్చు, సీఎం కావొచ్చు.. కానీ ఎన్నటికీ ఉద్యమకారుడు కాలేడని అన్నారు.
తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహి గానే చరిత్రలో మిగిలిపోతాడు తప్ప.. ఏనాటికీ ఉద్యమకారుడు కాలేడని షాకింగ్ కామెంట్స్ చేశారు.