NEWSTELANGANA

రాహుల్ స‌భ తుస్ – హ‌రీశ్

Share it with your family & friends

కాంగ్రెస్ పార్టీని న‌మ్మ‌ని జ‌నం

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీపై సెటైర్ వేశారు. ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు రాహుల్ గాంధీ హాజ‌రైన స‌రూర్ న‌గ‌ర్ స‌భ జ‌నం లేక వెల వెల బోయిందంటూ ఎద్దేవా చేశారు.

30 వేల కుర్చీలు వేశారు..కానీ ప‌ట్టుమ‌ని 3 వేల మంది కూడా రాలేద‌న్నారు హ‌రీశ్ రావు. విచిత్రం ఏమిటంటే సీఎం రేవంత్ రెడ్డి స్వ‌యంగా వీధి లోకి వ‌చ్చినా ఎవ‌రూ కూడా స్పందించ లేక పోయార‌ని అన్నారు.

ఆరు గ్యారెంటీల పేరుతో జ‌నం చెవుల్లో పూలు పెట్టి ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన సీఎం కుర్చీ ఎక్కాక అన్నింటిని మ‌రిచి పోయాడ‌ని ఆరోపించారు. జ‌నం అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, కాంగ్రెస్ పార్టీకి చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌ని అన్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

విచిత్రం ఏమిటంటే రండి రండి ద‌య‌చేయండి అంటూ స్వ‌యంగా ముఖ్య‌మంత్రే బ‌తిమాలినా ప‌ట్టించుకోక పోవ‌డం స‌ర్కార్ పాల‌న గ‌తి త‌ప్పింద‌ని తేలి పోయింద‌న్నారు మాజీ మంత్రి. తాను విసిరిన స‌వాల్ ను స్వీక‌రించ‌క పోవ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.