రేవంత్ కామెంట్స్ తన్నీరు సీరియస్
పాలమూరు వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం
సంగారెడ్డి – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు. గురువారం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పై వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం స్థాయికి తగదని పేర్కొన్నారు. ఇలా నోరు జారడం వల్ల ప్రజలు ఈసడించు కుంటారని హెచ్చరించారు తన్నీరు హరీశ్ రావు.
కేసీఆర్ ఆనాడు పోరాటం చేయక పోతే ఇవాళ నువ్వు అనుభవిస్తున్న తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు . ఇకనైనా ముందు వెనుకా ఆలోచించుకుని మాట్లాడాలని హితవు పలికారు మాజీ మంత్రి. పాలమూరు జిల్లా వెనుకబాటుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనేనని సంచలన ఆరోపణలు చేశారు. చేసి తప్పులను ఒప్పుకోవాల్సింది పోయి తమపై బురద చల్లితే ఎలా అని ప్రశ్నించారు.
కేసీఆర్ దేశంలోనే అత్యంత గొప్ప నాయకులలో ఒకరు అని, ఆయన చేసిన ప్లాన్ వల్లనే ఇవాళ తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులు కళ కళ లాడుతున్నాయని అన్నారు. 2014 నాటికంటే ముందు పాలమూరు పరిస్థితి ఉలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడాలని అన్నారు. కళ్లుండి కబోధి లాగా ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు తన్నీరు హరీశ్ రావు.