NEWSTELANGANA

సుపారీ తీసుకునే అలవాటు సీఎందే

Share it with your family & friends

త‌న్నీరు హ‌రీశ్ రావు షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ఓ ఛానెల్ తో ముఖాముఖి మాట్లాడారు. ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు. ప‌నిలో ప‌నిగా త‌మ‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు.

సుపారీ తీసుకునే అల‌వాటు త‌మ‌కు లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఆ అల‌వాటు రేవంత్ రెడ్డికే ఉంద‌ని మండిప‌డ్డారు. దుబ్బాక‌, మునుగోడు, హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల‌లో కాంగ్రెస్ పార్టీకి త‌నే డిపాజిట్లు రాకుండా చేశాడ‌ని ఆరోపించారు. ఆయ‌న‌ను జ‌నం న‌మ్మ‌ర‌ని అన్నారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఎవ‌రి స‌త్తా ఏమిటో తేలుతుంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఈ నాలుగు నెల‌ల కాలంలో ఎంత ఇబ్బందుల‌కు గుర‌వుతున్నామో అర్థం చేసుకున్నార‌ని, ఇక బీఆర్ఎస్ పార్టీనే మంచిద‌నే అభిప్రాయానికి జ‌నం వ‌చ్చార‌ని అన్నారు.

కాంగ్రెస పార్టీకి డిపాజిట్లు కూడా ద‌క్క‌వ‌ని జోష్యం చెప్పారు త‌న్నీరు హ‌రీశ్ రావు. వాపు చూసు బ‌లుపు అనుకుంటున్నార‌ని జ‌నం క‌ర్ర కాల్చి వాత పెట్టేందుకు సిద్ద‌మై ఉన్నార‌ని చెప్పారు.