తెలంగాణ సర్కార్ బేకార్ – హరీశ్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
హైదరాబాద్ – మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏం సాధించారంటూ విజయోత్సవాలు జరుపుతారంటూ ప్రశ్నించారు. ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. సీఎం తనంతకు తానే గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు హరీశ్ రావు.
సుపరిపాలన అని ప్రజలు చెప్పాలి కానీ సీఎం కాదన్నారు హరీశ్ రావు. అపరిపక్వత, అసమర్థత, ప్రతికూల వైఖరి రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. ఆర్థిక వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే వెనక్కి వెళ్లేలా చేశారని మండిపడ్డారు.
వృద్ధి రేటు పెంచే సత్తా లేదు, సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికి వచ్చినట్లు మాట్లాడటం దారుణమన్నారు. ఆడరాక మద్దెల ఓడు అనే సామెతకు నీ మాటల్ని మించిన నిదర్శనం లేదన్నారు.
ఈ ప్రభుత్వానికి ఆదాయం పెంచే సత్తా లేదని, ఇచ్చిన హామీలు అమలు చేసే చిత్తుశుద్ది లేదని, ప్రజలకు వాస్తవం చెప్పే దమ్ము లేదన్నారు.
ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీశ్రీ కవిత లాగా పాలన ఉందన్నారు. ఏడు లక్షల కోట్లు అంటూ అబద్దం చెప్పడం బాగోలేదని అన్నారు హరీశ్ రావు. అప్పులు బహిరంగ రహస్యమని, ప్రతి ఏటా కాగ్ వెల్లడిస్తుందన్నారు.