NEWSTELANGANA

కాలం చెల్లిన మందులపై నియంత్ర‌ణ ఏది..?

Share it with your family & friends

మొద్దు నిద్ర పోతే ఎలా అంటూ హ‌రీశ్ రావు ఫైర్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కావాల‌ని విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. వ‌రుస‌గా ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నా ఎందుకు ప‌ట్టించు కోవడం లేదంటూ ప్ర‌శ్నించారు. ఆదివారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు హ‌రీశ్ రావు.

వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో కాలం చెల్లిన (Expiry) మందులు ఉండ‌డం దారుణ‌మ‌న్నారు. ఇంతకంటే నిర్లక్ష్యం మరొకటి ఉంటుందా అని ప్ర‌శ్నించారు .

గిరిజన గురుకుల విద్యార్థుల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత చిన్న చూపా అని మండిప‌డ్డారు త‌న్నీరు హ‌రీశ్ రావు. ఈ మందుల వల్ల ప్రాణాల మీదకు వస్తే ఎవరు బాధ్యులు అని ప్ర‌శ్నించారు. కాలం చెల్లిన మందులు మెడికల్ క్యాంపులోకి ఎలా వచ్చాయంటూ నిల‌దీశారు.

అదిలాబాద్ జిల్లాలో ఇంత జరుగుతుంటే జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఏం చేస్తున్నట్లు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు త‌న్నీరు హ‌రీశ్ రావు. ఇంత జ‌రిగినా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు పట్టించుకునే తీరిక లేదా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర ఇంకెప్పుడు వీడుతుందని ఫైర్ అయ్యారు.