ఉత్తమ్ కామెంట్స్ హరీశ్ సీరియస్
కేసీఆర్ ఓ డెకాయిట్ అంటూ ఫైర్
హైదరాబాద్ – తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థాయి మరిచి కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
కేసీఆర్ ను ఉద్దేశించి డెకాయిట్ (దొంగ) అంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించడం పట్ల ఫైర్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు తన్నీరు హరీశ్ రావు.
బూతులు మాట్లాడడంలో, అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడంలో రేవంత్ రెడ్డికి తానేమీ తీసిపోనని నిరూపించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు.
పేరేమో ఉత్తమ్ కుమార్ మాట తీరేమో మూసీ ప్రవాహం లాగా ఉందన్నారు హరీశ్ రావు. రేవంత్ నోటితో పాటూ ఉత్తమ్ నోరు ను కూడా ప్రక్షాళన చేయాల్సి న అవసరం ఉందన్నారు. ఇక నుంచి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు మాజీ మంత్రి.