Monday, April 21, 2025
HomeNEWSఅబ‌ద్దాలు చెప్ప‌డంలో సీఎం నెంబ‌ర్ వ‌న్

అబ‌ద్దాలు చెప్ప‌డంలో సీఎం నెంబ‌ర్ వ‌న్

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – అబ‌ద్దాలు చెప్ప‌డంలో సీఎం రేవంత్ రెడ్డి నెంబ‌ర్ వ‌న్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న అబ‌ద్దాల‌కు సంబంధించి గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఎక్కుతారంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌భుత్వం చేత‌కాని త‌నం ఏమిటో అసెంబ్లీ సాక్షిగా తేలి పోయింద‌న్నారు.

రుణ మాఫీ, రైతు భ‌రోసా, రైతు బీమా, ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో చేతులెత్తేసింద‌న్నారు. ఇక సీఎం గాలి క‌బుర్లు త‌ప్పా చేసింది ఏమీ లేద‌న్నారు హ‌రీశ్ రావు. రెండు గంటల ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెప్ప‌డం త‌ప్పా చేసింది ఏముంద‌ని ప్ర‌శ్నించారు.

ఎస్‌ఎల్‌బీసీని ఒక్క కిలోమీటర్ తవ్వలేదని ఆరోపించారు మాజీ మంత్రి. తాము 11 కిలోమీటర్లకు పైగా తవ్వామ‌ని కానీ కాంగ్రెస్ స‌ర్కార్ ఇచ్చిన హామీల‌ను అమ‌లు ప‌ర్చ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని మండిప‌డ్డారు త‌న్నీరు హ‌రీశ్ రావు. నాలుగున్న‌ర కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌ను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారంటూ వాపోయారు.

ఇప్ప‌టికే వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని ఆరోపించారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments