Monday, April 21, 2025
HomeNEWSబన్నీని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి

బన్నీని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి హ‌రీశ్ రావు ఆగ్ర‌హం

హైద‌రాబాద్ – మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. బ‌న్నీ విష‌యంలో కావాల‌ని క‌క్ష సాధింపు ధోర‌ణితో సీఎం రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ఓ వైపు కోర్టు కేసులో ఉండ‌గా ఎలా అసెంబ్లీలో ప్ర‌స్తావిస్తార‌ని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి సోద‌రుడి టార్చర్ వల్ల ఒక రైతు సూసైడ్ చేసుకుంటే, ఇప్పటి వరకు దానిపై కనీసం కేసు నమోదు కాలేదన్నారు. దీనిపై ముందు సీఎం ప్ర‌జ‌ల‌కు స‌మాదానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 50 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే రేవంత్ రెడ్డి కనీసం దాని మీద మాట్లాడ లేద‌ని మండిప‌డ్డారు. క‌నీసం విచారం కూడా వ్య‌క్తం చేయ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

500 మంది రైతులు, 80 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రేవంత్ రెడ్డికి మాట్లాడటానికి సమయం లేదు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రం సమయం ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇదేనా ప్ర‌జా ప్ర‌భుత్వ పాల‌న అంటూ నిల‌దీశారు.

ఈ మొత్తం చావుల‌కు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments