హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్
బూటకపు ఎన్ కౌంటర్లు దారుణం
హైదరాబాద్ – మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరగడం, అందులో ఏడుగురు నక్సల్స్ చని పోవడాన్ని ప్రస్తావించారు.
ఓ వైపు ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తూనే మరో వైపు బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడతారంటూ ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు.
బూటకపు ఎన్ కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు హరీశ్ రావు.
అన్ని వర్గాలను మోసం చేసి ఆరు గ్యారెంటీలను అట కెక్కించారంటూ ఆరోపించారు. ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడిచారంటూ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నేత.
బూటకపు వాగ్దానాలు, బూటకపు ఎన్కౌంటర్లకు ప్రభుత్వం కేరాఫ్ గా మారడం దారుణమన్నారు తన్నీరు హరీశ్ రావు.