మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తాము నిలదీస్తేనే కానీ నిరుపేదల గురించి ఆలోచించడం లేదన్నారు. ప్రజా పాలన దరఖాస్తులకు ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. మీ సేవా దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలన్నారు.
ఆదివారం తన్నీరు హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రజలను మోసం చేయాలని చూసిన ప్రతిసారి, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తుంటాం, నిలదీస్తూనే ఉంటామన్నారు.పేదలకు రేషన్ కార్డులు అందకుండా చేస్తున్నారని, కోతలు విధిస్తున్నారని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడంతో పాటు, నిలదీస్తే గాని ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదన్నారు.
కుల గణన దరఖాస్తులతో పాటు, ప్రజాపాలన దరఖాస్తులకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం, ఇది తుది జాబితా కాదని, దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చెప్పించడం బిఆర్ఎస్ విజయంగా అభివర్ణించారు.ఆదాయ పెంపు విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండటం వల్ల లక్షల మంది నిరుపేద వర్గాలు రేషన్ కార్డులకు దూరం అవుతాయని మరొక్క సారి గుర్తు చేస్తున్నామన్నారు.