సంస్కారం లేనోడు సీఎం – హరీశ్ రావు
రేవంత్ రెడ్డి భగ్గుమన్న మాజీ మంత్రి
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్కారం లేకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. పదే పదే తనను రాజీనామా చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. దేని కోసం రాజీనామా చేయాలో తాను చెప్పాలన్నారు.
అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీలను ప్రకటించినా ఇప్పటి వరకు అమలు కానందుకు బాధ్యత వహిస్తూ ముందుగా సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సీఎంకు ఉండాల్సిన లక్షణాలు లేవన్నారు.
ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నానన్న సోయి లేకుండా మాట్లాడటం దారుణమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని, తెలంగాణ చరిత్రలో గాని ఇంతగా దిగజారిన దిక్కు మాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరని షాకింగ్ కామెంట్స్ చేశారు తన్నీరు హరీశ్ రావు.
అబద్దం కూడా సిగ్గుపడి మూసి నది లోకి దూకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది ముఖ్యమంత్రి ప్రవర్తన అంటూ ఎద్దేవా చేశారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బిఆర్ఎస్ మీద, నామీద అవాకులు చెవాకులు పేలడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.