NEWSTELANGANA

సీఎం నిర్వాకం హ‌రీశ్ రావు ఆగ్ర‌హం

Share it with your family & friends

గురు పూజోత్స‌వానికి వెళ్లక పోతే ఎలా..?

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన గురు పూజోత్సవానికి హాజ‌రు కాక పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. విద్య ప‌ట్ల , విద్యా శాఖ ప‌ట్ల మీకున్న చిత్తుశ‌ద్ది , ప్రాధాన్య‌త ఏమిటో దీని ద్వారా తెలిసి పోయిందంటూ మండిప‌డ్డారు.

ఈ 9 నెలల కాంగ్రెస్ పాలనలో విద్యా వ్య‌వ‌స్థ పూర్తిగా నాశ‌న‌మైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. టీచర్లు లేక పాఠశాలలు మూసేస్తున్నార‌ని, పురుగుల అన్నం, గొడ్డుకారం తినలేక విద్యార్థులు ఏడుస్తున్నారని, ఫుడ్ పాయిజన్, పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లతో రోదిస్తున్నార‌ని వాపోయారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

గురుకులాల ఖ్యాతిని రోజు రోజుకి దిగజార్చుతున్నార‌ని, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారని, తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు తెలియ చేస్తున్నా సీఎం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి.