NEWSTELANGANA

6200 మంది తొల‌గింపుపై హ‌రీశ్ ఫైర్

Share it with your family & friends


సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా రేవంత్ రెడ్డి అంటూ ప్ర‌శ్నించారు.

సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పని చేస్తున్న 6200 మంది పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలు (DEOs) ను ఏకకాలంలో విధుల నుండి తొలగించడం దుర్మార్గమైన చర్యగా ఆయ‌న అభివ‌ర్ణించారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని అన్నారు.

మూడు నెలలుగా జీతాలు చెల్లించ లేద‌ని, ఇవ్వ‌మ‌ని అడిగినందుకు ఉద్యోగాల తొల‌గించ‌డం దారుణ‌మ‌న్నారు. ఇదేనా మీ ప్రజా పాలన? ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం? అంటూ ఏకి పారేశారు.

విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను తొలగించి వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల బతుకులను ఆగం చేశారంటూ ఫైర్ అయ్యారు హ‌రీశ్ రావు..

మరోవైపు మీ నిర్లక్ష్య, అర్థం లేని నిర్ణయం వల్ల వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. .

తొలగించిన పార్ట్‌టైం లెక్చరర్లు, టీచర్లు, డీఈవోలను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, మూడు నెలల పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.