అప్పులు తెస్తామంటే ఎలా ..?
నిలదీసిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – రేవంత్ రెడ్డి సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. శనివారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
తమను అప్పులు చేశారంటూ పదే పదే ఆరోపిస్తూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రూ. 60 వేల కోట్లు అప్పులు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తామంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రోజుకో మాట మాట్లాడుతూ ప్రతిపక్షాలను నోరు మూయించేలా చేస్తుండడం భావ్యం కాదన్నారు.
గతంలో తాము రూ. 40 వేల కోట్లు అప్పులు తీసుకుంటే గోబెల్స్ ప్రచారం చేశారని, దీనిని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో లబ్ది పొందారని ధ్వజమెత్తారు. మరి దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారోనని అన్నారు.
రేవంత్ ప్రభుత్వం తమకు తక్షణమే రూ. 59,625 కోట్లు అప్పుగా తెస్తామంటూ తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ప్రతిపాదించారని దీనిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. హామీలు ఇచ్చే ముందు ఆలోచించాలని సెటైర్ వేశారు. ఇకనైనా రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పడం మాను కోవాలని హితవు పలికారు తన్నీరు హరీశ్ రావు.