NEWSTELANGANA

కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తే ఎలా

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డిపై హ‌రీశ్ రావు ఫైర్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న హైద‌రాబాద్ లోని ప్ర‌ముఖ రెస్టారెంట్ నీలోఫ‌ర్ లో కాసేపు సేద దీరారు. ఆయ‌న‌తో పాటు మాజీ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ కూడా ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం , బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ చేసిన మంచి ప‌నుల‌కు సంబంధించి ఆన‌వాళ్లు లేకుండా చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కంక‌ణం క‌ట్టుకున్నార‌ని, కానీ నాలుగున్న‌ర కోట్ల‌కు జాతిపిత‌గా , బాపుగా పిలుచుకునే కేసీఆర్ జోలికి ఎవ‌రు వ‌చ్చిన ఊరుకోర‌ని హెచ్చ‌రించారు.

తెలంగాణ ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టి, తానే ముందుండి ర‌థ సార‌థిగా కొత్త రాష్ట్రాన్ని తీసుకు రావ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించారు కేసీఆర్ అని అన్నారు. కావాల‌ని ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నుతోంద‌ని ఆరోపించారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

ఆరు నూరైనా బీఆర్ఎస్ ను భూ స్థాపితం చేసే స‌త్తా రేవంత్ రెడ్డికి లేద‌న్నారు .