NEWSTELANGANA

రుణ మాఫీ ఊసెత్త‌ని సీఎం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన హ‌రీశ్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా రైతులు తీసుకున్న రుణాల‌ను మాఫీ చేస్తాన‌ని చెప్పిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాట మార్చింద‌ని ఆరోపించారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా హ‌రీశ్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణ సాయం ప్ర‌క‌టించ‌క పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు. 2 లక్షల రూపాయల రుణ మాఫీ ఒకేసారి చేస్తామని ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రైతుకు వారి బ్యాంకు ఖాతాలో జ‌మ చేసిన పాపాన పోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌ర్కార్ ప‌ట్టించుకోక పోవ‌డంతో బ్యాంకులు మాత్రం నోటిసులు ఇవ్వ‌డం దారుణ‌మ‌న్నారు.

ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయ‌ని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వాపోయారు త‌న్నీరు హ‌రీశ్ రావు. తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థిక భారం పడుతున్నద‌ని ఆవేద‌న చెందారు.