NEWSTELANGANA

రైతుల‌కు సీఎం క్ష‌మాప‌ణ చెప్పాలి

Share it with your family & friends

త‌న్నీరు హ‌రీశ్ రావు డిమాండ్

హైద‌రాబాద్ – ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమ‌లు చేయ‌డంలో వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపించారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు.
పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండు కోవడం కోసం మాయ మాట‌లు చెబుతున్నాడ‌ని సీఎం రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డారు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వ‌డం మాట త‌ప్ప‌డ‌మేన‌ని పేర్కొన్నారు.

డిసెంబ‌ర్ 9న రోజు రుణ మాఫీ చేస్తామ‌ని చెప్పార‌ని, ఇచ్చిన మాట నిల‌బెట్టుకోలేక పోయినందుకు రేవంత్ రెడ్డి వెంట‌నే రైతుల‌కు క్ష‌మాప‌ణ చెప్పి తీరాల‌ని డిమాండ్ చేశారు హ‌రీశ్ రావు. రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన పోరాటానికి భయపడే రేవంత్ ఈ ప్రకటన చేశారని మండిప‌డ్డారు.

ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్ర‌శ్నించారు. వ్యవసాయ కూలీలకు 12000 ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదన్నారు. పేద మహిళలకు నెలకు 2500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమయిందన్నారు. రూ. 4 వేలకు పెంచుతామన్న పెన్షన్ను ఎప్ప‌టి నుంచి ఇస్తారో చెప్పాల‌న్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి పాల‌నా ప‌రంగా విఫ‌లం అయ్యార‌ని అన్నారు.