సర్కార్ నిర్లక్ష్యం వరద బాధితులకు శాపం
నిప్పులు చెరిగిన తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరంగా పూర్తిగా విఫలమైందని ఆరోపించారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. కీలకమైన హోం శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకని స్పందించడం లేదని ప్రశ్నించారు.
శుక్రవారం తన్నీరు హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. వరద బాధితులకు సహాయం చేయడంలో ఘోరంగా విఫలం అయ్యాడని ఫైర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు. రుణ మాఫీ చేయడంలో నిర్లక్ష్యం, విద్యా పరంగా పూర్తిగా పక్కదారి పట్టించడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
విద్యార్థులు రోడ్డెక్కారని వాపోయారు తన్నీరు హరీశ్ రావు. ఉన్నట్టుండి గురు పూజోత్సవ వేళ 6200 మందిని ఉన్న పళంగా తీసి వేయడం దారుణమన్నారు. ఇదేనా ప్రజా పాలన అని మండిపడ్డారు.
ఇవాళ వ్యవస్థలన్నీ నిర్వీర్యమై పోయాయని , ఇకనైనా పాలన పరంగా ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని తన్నీరు హరీశ్ రావు సూచించారు.
ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్కటీ అమలు కాక పోవడం దారుణమన్నారు. ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇంకేదీ ఆచరణకు నోచు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.