NEWSTELANGANA

గ్యారెంటీల ఊసేది ప‌సిడి జాడేది

Share it with your family & friends

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డిపై , కాంగ్రెస్ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తామ‌ని చెప్పినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క దానిని కూడా పూర్తిగా అమ‌లు చేయ‌లేక పోయారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే తులం బంగారాన్ని ఆడ బిడ్డ‌ల‌కు ఇస్తామంటూ ప్ర‌క‌టించారని , ఇప్ప‌టి వ‌ర‌కు దాని ఊసే లేద‌న్నారు. ఎన్నిక‌ల వేళ మ‌రోసారి మాయ మాట‌లు చెప్ప‌డం సీఎం రేవంత్ రెడ్డికి అల‌వాటుగా మారింద‌న్నారు హ‌రీశ్ రావు.

ఇచ్చిన మాట మీద నిల‌బ‌డ‌ని వాళ్లు త‌మ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు మాజీ మంత్రి. కాంగ్రెస్ పార్టీ మోస పూరిత మాట‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. ఈసారి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఓడి పోడ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వెంట‌నే 2 ల‌క్ష‌ల జాబ్స్ యుద్ద ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టి కూడా నింప లేద‌న్నారు. త‌మ స‌ర్కార్ హ‌యాంలో ప్ర‌క‌టించని వాటిని వెల్ల‌డించి తామే భ‌ర్తీ చేశామంటూ గొప్ప‌లు పోతున్నారంటూ ఫైర్ అయ్యారు.