NEWSTELANGANA

అబ‌ద్దాలు చెప్ప‌డంలో సీఎం నెంబ‌ర్ వ‌న్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ – మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయ‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

రోజు రోజుకు త‌న స్థాయికి త‌గిన‌ట్టుగా రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రించ‌డం లేదంటూ ఎద్దేవా చేశారు. గ‌తంలో ముఖ్య‌మంత్రులుగా ప‌ని చేసిన వారు ఇలాంటి అబ‌ద్దాలు ఆడ లేద‌న్నారు. కానీ వారు ఏదైతే చెప్పారో అది చేసేందుకు ప్ర‌య‌త్నం చేశార‌ని గుర్తు చేశారు.

కానీ రేవంత్ రెడ్డి మాత్రం గ‌త సీఎంల కంటే భిన్నంగా ఉన్నార‌ని మండిప‌డ్డారు. చెప్పేది ఒక‌టి చేసేది మ‌రోటి అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు త‌న్నీరు హ‌రీశ్ రావు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు . దీని వ‌ల్ల త‌న విలువ‌ను తానే కోల్పోతున్నార‌న్న విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని సూచించారు రేవంత్ రెడ్డికి హ‌రీశ్ రావు.

అబ‌ద్దాలు చెప్ప‌డంలో టాప్ లో కొన‌సాగుతున్నార‌ని , ఒక‌వేళ అవార్డు గ‌నుక ఇస్తే భాస్క‌ర్ అవార్డు రేవంత్ రెడ్డికి ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు హ‌రీశ్ రావు. ముఖ్యమంత్రి మాట్లాడే అబద్ధాలు చూసి అబద్దం కూడా హుస్సేన్ సాగర్లో దూకి సచ్చి పోయి ఉండేద‌న్నారు మాజీ మంత్రి.