రైతులపై కాంగ్రెస్ సర్కార్ కక్ష
మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసం చేశారంటూ ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో బద్నాం చేయడం మానుకోవాలని సూచించారు హరీశ్ రావు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డికి కావాల్సిన అనుమతులు తీసుకు వచ్చామని అన్నారు. పంప్ హౌజ్‌లు, సబ్ స్టేషన్లు, టన్నెల్లు, రిజర్వాయర్లు అన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు తన్నీరు హరీశ్ రావు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కాలువలు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. జనం చెవుల్లో పూలు పెట్టారంటూ ధ్వజమెత్తారు. కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారంటూ ధ్వజమెత్తారు హరీశ్ రావు.
కాళేశ్వరం పేరుతో తమను టార్గెట్ చేయడం సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అనుచర వర్గం మానుకోవాలని సూచించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.