మోతీలాల్ కు పరామర్శ సర్కార్ పై కన్నెర్ర
ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. గ్రూప్స్, నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ ను పరామర్శించారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్ తో మాట్లాడాలని, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులతో చర్చలు జరపాలని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాకా నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. మోతిలాల్ నాయక్ దీక్ష విరమించాలని మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు హరీశ్ రావు.
మోతీలాల్ నాయక్ కు ఏం జరగక ముందే ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు.