మంత్రికి మతి భ్రమించింది
నిప్పులు చెరిగిన హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై భగ్గుమన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను అమెరికా వెళ్లింది వాస్తవమేనని పేర్కొన్నారు.
సీఎం, మంత్రులు అబద్దాలతో సర్కార్ నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. తాను అమెరికాలో ప్రభాకర్ రావును కలిసినట్టు మంత్రి ఆరోపించడాన్ని తప్పు పట్టారు. కలిసినట్టు నిరూపిస్తే అమర వీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాయడానికి సిద్దమన్నారు.
రుజువు చేయకపోతే వెంకట్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. తాను విదేశీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు హరీశ్ రావు.
నా పాస్‌పోర్ట్‌తో సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తానని ప్రకటించారు. పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయని తెలిపారు. .కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడటం చౌకబారుతనాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.