పంచాయతీలపై వివక్ష ఎందుకింత కక్ష
ఉన్న మాట అంటే ఉలుకు ఎందుకు..?
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. అభివృద్దికి పట్టుకొమ్మలుగా భావించే గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయడం, పంచాయతీలలో పని చేస్తున్న వారికి వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు తన్నీరు హరీశ్ రావు.
ప్రధానంగా పెండింగ్ బిల్లులు చెల్లించక పోవడం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మండిపడ్డారు మాజీ మంత్రి. తాము అబద్దాలు చెప్పడం లేదని , వాస్తవాలు మాట్లాడితే పంచాయతీరాజ్ , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఎందుకు ఉలికి పడుతున్నారంటూ ప్రశ్నించారు .
ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించక పోవడం వాస్తవం కాదా అని నిలదీశారు తన్నీరు హరీశ్ రావు.
కేంద్రం నుండి ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన 2100 కోట్ల నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్ళించింది అబద్దమా? 15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 500 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఆపింది అబద్దమా అని మండిపడ్డారు.