నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ పోరాటం
సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం
హైదరాబాద్ – నిరుద్యోగుల న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ గాంధీ ఆస్పత్రిలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పరామర్శించారు. ఆయనకు భరోసా ఇచ్చారు. వెంటనే దీక్ష విరమించాలని, ఆరోగ్యం ముఖ్యమని స్పష్టం చేశారు.
ప్రభుత్వం దిగి వచ్చేంత దాకా తాను దీక్ష మానుకునే ప్రసక్తి లేదని మోతీలాల్ నాయక్ అన్నారు. అనంతరం తన్నీరు హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. నాయక్ కు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు హరీశ్ రావు.
కోదండరాం పిల్లల హక్కుల పట్ల పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. అమలు చేసే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మోతీలాల్ నాయక్ ఏడు రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేక పోవడం దురదృష్టకరమని అన్నారు మాజీ మంత్రి. .
ఇది నా ఒక్కడి పోరాటం కాదు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న అని నాయక్ తనతో చెప్పాడని తెలిపారు. అందరం కలిసి పోరాటం చేద్దాం, మేము మీ వెంట ఉన్నాం, ప్రాణం ముఖ్యం, తండ్రి లేని వాడివి జాగ్రత్తగా ఉండాలని సూచించామన్నారు.