ఎవరి భిక్ష వల్లనో నాకు పదవి రాలేదు
నిప్పులు చెరిగిన తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయన స్థాయికి తగిన విధంగా మాట్లాడటం లేదన్నారు. అసెంబ్లీలో అన్నీ అబద్దాలు తప్పా ఒక్క నిజం మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు హరీశ్ రావు.
తనకు కాంగ్రెస్ పార్టీ పదవి ఇచ్చిందంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆరోజు తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో సోనియా గాంధీ పిలిచి మంత్రివర్గంలో చేరమని అడిగారని, ఆ విషయం తనకు తెలిసినా ఇలా ఎలా మాట్లాడతారంటూ నిలదీశారు.
విచిత్రం ఏమిటంటే తనకు మంత్రి పదవి వచ్చినప్పుడు తను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నానన్న సంగతి మరిచి పోయి మాట్లాడటం ఎంత వరకు సబబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా తన వెనకే నక్కి నక్కి చూసిన సంగతి మరిచి పోవడం దారుణమన్నారు మాజీ మంత్రి.
ఇవేవీ తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేయడంపై ఫైర్ అయ్యారు తన్నీరు హరీశ్ రావు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిదంటూ నిలదీశారు.