కాంగ్రెస్ సర్కార్ బేకార్ – హరీశ్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు మాజీ మంత్రి హరీశ్ రావు. శనివారం శాసన సభ వేదికగా నిప్పులు చెరిగారు. అబద్దాలు, మోస పూరితంగా పవర్ లోకి వచ్చి 90 రోజులు పూర్తియినా ఇంకా పనితీరులో మార్పు రాక పోవడం దారుణమన్నారు. ఇకనైనా సీఎం తన పనితీరు మార్చుకోవాలని సూచించారు.
10 ఏళ్ల పాటు కాపాడుకుంటూ వచ్చిన , అభివృద్ది పథంలోకి తీసుకు వెళ్లిన తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి వెనక్కి తీసుకు వెళుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తిగా రాజకీయ ప్రసంగంలా ఉందే తప్పా ఏ వర్గానికి న్యాయం చేకూర్చ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో వారికి చుక్కలు చూపించడం ఖాయమన్నారు. విద్యా, ఆరోగ్య రంగాలను పూర్తిగా విస్మరించారని వాపోయారు తన్నీరు హరీశ్ రావు. కాళేశ్వరం, మేడిగడ్డపై చెప్పినవన్నీ అబద్దాలేనంటూ తేలి పోయిందన్నారు. భారీ ఎత్తున వస్తున్న వరద ఉధృతిని తట్టుకుని నిలబడిందని, ఎక్కడా కూలి పోలేదని , ఆ విషయం గుర్తిస్తే మంచిదన్నారు.