Monday, April 21, 2025
HomeNEWSశ్రీ‌తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాలి - హ‌రీశ్

శ్రీ‌తేజ్ త్వ‌ర‌గా కోలుకోవాలి – హ‌రీశ్

ప‌ది రోజుల త‌ర్వాత స్పందిస్తే ఎలా

హైద‌రాబాద్ – సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించి ,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మాజీ మంత్రి టి .హరీష్ రావు . దురదృష్టకరమైన ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను కేసీఆర్ సూచనతో బీఆర్ఎస్ నేతలం పరామర్శించామ‌ని తెలిపారు.

అనంత‌రం హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. శ్రీతేజ్ కోలుకుంటున్నారని , చికిత్స‌కు స్పందిస్తున్నాడ‌ని తెలిపారు. భగవంతుడి దీవెనలతో శ్రీ తేజ్ కోలుకుని మళ్ళీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నామ‌ని అన్నారు.

తొక్కిసలాట లో మరణించిన రేవతి కి మా ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. తాను మరణిస్తున్నా కొడుకు శ్రీ తేజ్ ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనంంద‌రం చూశామ‌న్నారు.
ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదన్నారు.

సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం ,మంత్రులు స్పందించ‌డం దారుణ‌మ‌న్నారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి ,ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించ లేద‌ని ప్ర‌శ్నించారు హ‌రీశ్ రావు.

గురుకులాల పిల్లల మాతృ మూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించడం లేదని అన్నారు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రెవంత్ కొండారెడ్డి పల్లి లో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య కు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాల‌ని అన్నారు.

సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై సీఎం ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. త‌న వారికో న్యాయం ఇత‌రుల‌కు మ‌రో న్యాయ‌మా ఇదేనా మీ ప్ర‌జా పాల‌న అంటూ ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments