నిప్పులు చెరిగిన హరీశ్ శంకర్
ఈగిల్ చిత్రంపై విషం చిమ్మితే ఎలా
హైదరాబాద్ – ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ నిప్పులు చెరిగారు. మాస్ మహరాజా నటించిన ఈగిల్ చిత్రంపై కొందరు పనిగట్టుకుని వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. తనకు రవితేజకు మధ్య ఉన్న అనుబంధాన్ని తప్పుగా రాయడాన్ని ప్రస్తావించారు.
వ్యక్తిగతంగా అభిప్రాయాలు కలవక పోవచ్చు. కలవాలని రూల్ ఏమీ లేదు. కానీ పనిగట్టుకుని క్యారెక్టర్ ను దిగజార్చే ప్రయత్నం చేయడం మాత్రం తాను ఒప్పుకోనని స్పష్టం చేశారు హరీశ్ శంకర్. ఈగిల్ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ మహరాజాది ప్రత్యేకమైన వ్యక్తిత్వం అన్నారు. ఆయన కష్ట పడే వారికి సహాయం చేస్తారని పేర్కొన్నారు. తాను ఈ స్థాయిలో నిలబడ్డానంటే కారణం తనకు ఆనాడు మరిపకాయ్ సినిమా ఛాన్స్ ఇచ్చారని చెప్పారు హరీష్ శంకర్.
అయితే రవితేజ నటించిన ఈగిల్ చిత్రం గురించి పదే పదే వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సినిమాలో దమ్ముంటే ఎవరూ అడ్డుకున్నా ఏమీ కాదన్నారు దర్శకుడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.