హర్యానాలో కాంగ్రెస్ కు సానుకూలత
ఎదురీదుతున్న బీజేపీ ..ఆప్ ప్రభావం
హర్యానా – హర్యానా రాష్ట్రంలో ప్రస్తుతం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అక్కడ కొలువు తీరింది. కానీ ప్రస్తుతం జరగబోయే శాసన సభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకుంది. దీంతో ఈసారి పవర్ లోకి రావడం కష్టమేనని ప్రచారం జరుగుతోంది.
లోక్ పోల్ సంస్థ జరిగిపిన తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. హర్యానాలో సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పార్టీని నిలబెట్టేందుకు, కాంగ్రెస్కు ఇప్పటికీ అనుకూలంగానే ఉంది.
కేంద్ర నాయకత్వం ప్రచారం మరింత విస్తృతి, సానుకూల ఫలితాలను తెస్తుందని భావిస్తున్నారు . ఓట్ల చీలికలు బహుముఖ తగాదాలలో బిజెపికి స్వల్పంగా లాభించవచ్చు, అయితే ప్రత్యక్ష పోటీ ఉన్న నియోజకవర్గాలలో కాంగ్రెస్కు ప్రయోజనం ఉంటుందని అంచనా.
చాలా మంది ఓటర్లు INLD-BSP , JJP-ASP పొత్తులు BJPకి సంబంధించి “B టీమ్లు”గా భావించబడుతున్నాయి. బీజేపీ ప్రచారం చేసినా జాట్ లు, చామర్ లతో సహా దళిత సమాజం ప్రస్తుతం హస్తం వైపు చూస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 7 హామీలు, ముఖ్యంగా 2 లక్షల పర్మినెంట్ ఉద్యోగాలు, మహిళలకు రూ. 2,000 , వృద్ధులకు రూ. 6,000 పెన్షన్ హామీలు ఓటర్లను బాగా ఆకట్టుకుంటన్నాయి.