NEWSNATIONAL

హ‌ర్యానా స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

Share it with your family & friends

నిరుద్యోగ భృతిని ప్ర‌క‌టించిన సీఎం

హ‌ర్యానా – రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి న‌యాబ్ సింగ్ సైనీ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఇచ్చిన హామీ మేర‌కు నిరుద్యోగ భృతి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇంట‌ర్మీడియ‌ట్ పాసై జాబ్స్ రాని వారికి నెల‌కు రూ. 1,200 , గ్రాడ్యుయేట్ ల‌కు నెల‌కు రూ. 2,000, పోస్ట్ గ్రాడ్యూయేట్ ల‌కు నెల‌కు రూ.3,500 ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు సీఎం. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన విధంగా ల‌బ్దిదారులైన నిరుద్యోగుల‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాల‌లో జ‌మ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు న‌యాబ్ సింగ్ సైనీ.

త్వ‌ర‌లోనే నిరుద్యోగుల‌కు ఇబ్బందులు లేకుండా చేస్తామ‌ని తెలిపారు. ఉపాధి క‌ల్పించేందుకు వివిధ కంపెనీల‌ను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు సీఎం. దీని వ‌ల్ల కొంత మేర‌కు నిరుద్యోగం త‌గ్గుతుంద‌ని తాము భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు .

ఎప్ప‌టిక‌ప్పుడు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విధంగానే ప్ర‌భుత్వ ప‌రంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు న‌యాబ్ సింగ్ సైనీ.