NEWSNATIONAL

హ‌ర్యానాలో హ‌స్తం హ‌వా..హూడాకే సీఎం ఛాన్స్

Share it with your family & friends

90 స్థానాల‌లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ

హ‌ర్యానా – రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిశాయి. దాదాపు 61 శాతానికి పైగా పోలింగ్ న‌మోదైంది. ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న ఖ‌ట్ట‌ర్ భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వానికి బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది. ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డ‌య్యాయి. కాంగ్రెస్ పార్టీ బంప‌ర్ మెజారిటీ సాధించ‌డం ఖాయ‌మ‌ని తేల్చి చెప్పాయి. అన్ని సంస్థ‌లు గంప గుత్త‌గా హ‌స్తానిదే హ‌ర్యానా అని తేల్చి చెప్పాయి.

ఇండియా టుడే సీ ఓట‌ర్ సర్వే బీజేపీకి 20 సీట్లు వ‌స్తాయ‌ని పేర్కొన‌గా కాంగ్రెస్ పార్టీకి 58 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని తెలిపింది. జేజేపీ 2 సీట్లు రావ‌చ్చ‌ని పేర్కొంది. ఓట్ల శాతం ప‌రంగా చూస్తే బీజేపీకి 37 శాతం , కాంగ్రెస్ పార్టీకి 44 శాతం ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. ఇరు పార్టీల మ‌ధ్య ఓట్ల శాతం 7 శాతం మ‌ధ్య‌న ఉంది.

ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుండ‌డం ఖాయ‌మ‌ని తేల‌డంతో కాంగ్రెస్ పార్టీలో సంద‌డి నెల‌కొంది. ఎవ‌రు త‌దుప‌రి ముఖ్య‌మంత్రి అవుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. కానీ పార్టీ హైక‌మాండ్ ఇప్ప‌టికే సీనియ‌ర్ నాయ‌కుడైన భూపీంద‌ర్ సింగ్ హూడాకే సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెట్టే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.