దత్తన్నకు ధన్యవాదాలు – రేవంత్ రెడ్డి
అలయ్ బలయ్ అంటేనే బండారు
హైదరాబాద్ – హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా సీఎం సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే అక్టోబర్ నెలలో దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్ బలయ్ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు బండారు దత్తాత్రేయ. ఆయనకు అన్ని వర్గాలు, కులాలు, మతాలకు చెందిన ప్రముఖులు, నేతలతో సత్ సంబంధాలు ఉన్నాయి. కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు ప్రతి ఏటా జరిగే అలయ్ బలయ్ కోసం హాజరు కానున్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి తాను నిర్వహించ బోయే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానం పలికారు. సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం.
అలయ్ బలయ్ అంటేనే దత్తన్న గుర్తుకు వస్తాడని, ఆయన నిబద్దతతో చేసుకుంటూ వస్తున్నారని కొనియాడారు ఎ. రేవంత్ రెడ్డి. అలయ్ బలాయ్ తెలంగాణ సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.
హర్యానా గవర్నర్ హోదాలో ఉన్నప్పటికీ ఆయన అలాయ్ బలాయ్ ను మర్చి పోకుండా సాంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయమని ప్రశంసించారు. ఇదిలా ఉండగా వచ్చే అక్టోబర్ 13న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.