ఏ పార్టీకి మద్దతు ఇవ్వం – కిసాన్ నేత
కిసాన్ మహాపంచాయత్ లో తీర్మానం
హర్యానా – కిసాన్ మహా పంచాయత్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్యానా లోని జింద్ జిల్లా లోని ఉచన లో కీలక సమావేశం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సమావేశమైన రైతులు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని నాలుగు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా హర్యానాలో సైతం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో తాము ఎవరికి, ఏ పార్టీకి మద్దతు ఇవ్వ కూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు మహా పంచాయత్ కిసాన్ నేత ఒకరు.
ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వ కూడదని లేదా వ్యతిరేకించ కూడదని నిర్ణయించినట్లు తెలిపారు. హర్యానా, పంజాబ్ , ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా కీలకంగా మారనున్నారు రైతన్నలు. తమ న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం గత కొన్నేళ్ల నుంచి పోరాటం చేస్తూ వస్తున్నారు.
ప్రధానంగా కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సర్కార్ తమ పట్ల వివక్ష ప్రదర్శించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర కల్పించాలని, తాము పండించిన పంటకు న్యాయం చేయాలని కోరుతున్నారు.