SPORTS

హెచ్‌సిఎ కీల‌క నిర్ణ‌యాలు

Share it with your family & friends

వార్షిక స‌ర్వ స‌భ్య స‌మావేశం

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్సీఏ) వార్షిక స‌ర్వ స‌భ్య స‌మావేశం ఆదివారం హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మం ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహ‌న్ రావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ కీల‌క స‌మావేశానికి భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హరుద్దీన్ , శివ లాల్ యాద‌వ్ , అర్ష‌ద్ అయూబ్ , చాముండేశ్వ‌రీ నాథ్ , జి. వినోద్ కుమార్ , మాజీ ఎంపీ హ‌నుమంత రావు పాల్గొన్నారు.

వీరితో పాటు వంకా ప్ర‌తాప్ , అమ‌ర్ నాథ్ , అనిల్ , జాస్ మ‌నోజ్ , విజ‌య‌నాథ్ , అపెక్స్ స‌భ్యులు, క్ల‌బ్ కార్య‌ద‌ర్శులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. భార‌త క్రికెట్ లో కీల‌కంగా గ‌తంలో సేవ‌లు అందించిన క్రికెట‌ర్లు , స‌భ్యులు పాల్గొనడం ప‌ట్ల ధ‌న్య‌వాదాలు తెలిపారు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ చీఫ్ జ‌గ‌న్ మోహ‌న్ రావు .

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల హెచ్ సీ ఏ కొత్త కార్య‌వ‌ర్గం ఏర్ప‌డిన త‌ర్వాత కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో భార‌త్ , ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ ను ఉప్ప‌ల్ లో ఘ‌నంగా నిర్వ‌హించింది. దీని ద్వారా భారీ ఆదాయం మూట‌గ‌ట్టుకుంది హెచ్ సీ ఏ. గ‌తంలో ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంది. ప్ర‌ధానంగా అజ‌హ‌రుద్దీన్ చీఫ్ గా ఉన్న స‌మ‌యంలో .