కోచ్ విద్యుత్ జయసింహకు షాక్
క్రికెట్ కు దూరంగా ఉండాలని ఆదేశం
హైదరాబాద్ – హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు శుక్రవారం హెచ్ సీ ఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సీనియర్ మహిళా జట్టు ప్రధాన కోచ్ గా హైదరాబాద్ కు చెందిన విద్యుత్ జయ సింహ ఉన్నారు.
ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా మహిళా టీమ్ తో కలిసి విమానంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఆల్కహాల్ సేవిస్తున్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించి న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు హెచ్ సీ ఏ ప్రెసిడెంట్. వెంటనే విచారణకు ఆదేశిస్తున్నట్లు స్పష్టం చేశారు. విచారణ జరిగేంత వరకు క్రికెట్ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని జగన్ మోహన్ రావు ఆదేశించారు.
విచారణ పూర్తయ్యాక వాస్తవాలను బట్టి విద్యుత్ జయ సింహ ప్రధాన కోచ్ గా ఉండాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.