రంజీ ట్రోఫీ టీమ్ కు నజరానా
ఆర్థిక సాయం ప్రకటించిన ప్రెసిడెంట్
హైదరాబాద్ – హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్ సీ ఏ ) ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తీపి కబురు చెప్పారు. మంగళవారం ఆయన కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో రంజీ ట్రోఫీ (ప్లేట్ )లో గెలిచింది హైదరాబాద్ రంజీ జట్టు.
ఈ సందర్బంగా మొత్తం జట్టు సభ్యులను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రంజీ టీమ్ కు రూ. 10 లక్షలు అందజేశారు. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి రూ. 50,000 బహుమతిగా ప్రకటించారు.
జగన్ మోహన్ రావు మరో సంచలన ప్రకటన చేశారు. హెచ్ సీఏ తరపున కూడా జట్టుకు వచ్చే 3 సంవత్సరాలలో రంజీ ఎలైట్ ట్రోఫీని గనుక గెలిస్తే జట్టుకు రూ. ఒక కోటి నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా ప్రతి ఆటగాడికి బీఎండబ్ల్యూ కారు అందజేస్తామని హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో రాష్ట్రం నుండి అనేక మంది క్రీడాకారులను దేశం తరపున ప్రాతినిధ్యం వహించేలా చేస్తామని స్పష్టం చేశారు.