ఏసీసీ చైర్మన్ జే షాకు కంగ్రాట్స్
హెచ్ సీ ఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు
హైదరాబాద్ – భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జే షా కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ముచ్చటగా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి చైర్మన్ గా ఎన్నికయ్యారు. ప్రధానంగా ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యధికంగా ఆదాయం కలిగిన ఏకైక క్రీడా సంస్థగా బీసీసీఐ నిలిచింది. వేల కోట్ల రూపాయలు స్పాన్సర్ రూపంలో సమకూరాయి.
ప్రత్యేకించి బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) కు భారీ ఎత్తున డబ్బులు కోట్లల్లో వచ్చి పడుతున్నాయి. ఇదే సమయంలో ఆసియా వ్యాప్తంగా క్రికెట్ ను ప్రాచుర్యం పొందేలా చేయడంలో బీసీసీఐ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా మరోసారి ఎన్నికైన బీసీసీఐ సెక్రటరీ జే షాను కలిసి అభినందించారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ) చైర్మన్ జగన్ మోహన్ రావు. ఐసీసీ చైర్మన్ కావాలని ఈ సందర్బంగా ఆకాంక్షించారు. మరో వైపు హైదరాబాద్ లో భారత్ , ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ను అద్భుతంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. రూ. 4 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది హెచ్ సీ ఏకు.