లెజెండరీ క్రికెటర్ తో ముఖాముఖి
హైదరాబాద్ – హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఈ సందర్బంగా హాజరైన కుంబ్లేను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు హెచ్ సీ ఏ చీఫ్.
తన జీవితంలో మరిచి పోలేని రోజుగా ఇది నిలిచి పోతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తను చీఫ్ గా ఎన్నికైన తర్వాత టెస్టు మ్యాచ్ పరంగా ఏకంగా రూ. 4.25 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. అంతే కాకుండా లక్షా 18 వేల మందికి పైగా మ్యాచ్ ను వీక్షించారని ఇది ఊహించని రికార్డ్ అని పేర్కొన్నారు జగన్ మోహన్ రావు.
రాబోయే రోజుల్లో మరిన్ని మ్యాచ్ లకు హైదరాబాద్ వేదిక కానుందని స్పష్టం చేశారు. గ్రామీణ, మండల, పట్టణ స్థాయిలలో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అభివృద్దికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.