సీఎం రేవంత్ రెడ్డి..మంత్రి శ్రీధర్ బాబు చర్చలు
దావోస్ – సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చేసిన కృషి ఫలించింది. ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థ శివ నాడర్ కు చెందిన హెచ్ సీ ఎల్ కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ లో కొత్తగా టెక్ సెంటర్ ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. హెచ్ సీఎ ల్ టెక్ గ్లోబల్ సిఇఓ , ఎండీ విజయ్ కుమార్ తో సీఎం చర్చలు జరిపారు.
హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. 5 వేల మంది ఐటీ నిపుణులకు జాబ్స్ రానున్నాయని వెల్లడించారు సంస్థ సీఈఓ, ఎండీ. ఇదిలా ఉండగా దావోస్ సదస్సులో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.
ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట సమావేశం అయ్యారు. వారు ఎవరో కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ , ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ ముగ్గురు తమ తమ రాష్ట్రాలలో తాము చేసిన పనుల గురించి గొప్పలు చెప్పారు.
ఐటీ హబ్ గా ఏపీని చేస్తామని చంద్రబాబు చెబితే, రైజింగ్ తెలంగాణ పేరుతో ముందుకు వెళుతున్నామని ప్రకటించారు రేవంత్ . కానీ ఫడ్నవీస్ మాత్రం మరాఠా ఎప్పటికీ అన్ని రంగాల్లో ముందుంటుందన్నారు.